తన వ్యాఖ్యలు వాస్తవం కాదని, అనారోగ్యం, ఒత్తిడి కారణంగానే అలా మాట్లాడానని తుంటి ఎల్లయ్య బుధవారం రాత్రి స్పష్టం చేశారు. సీఎం సహాయ నిధి నుంచి ఎనిమిది లక్షల రూపాయలు దారి మళ్లించారని తాను చేసిన ఆరోపణలు తప్పని, ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన వివరణ ఇచ్చారు. తన ముందటి వ్యాఖ్యలు సరైనవి కావని, ఈ వ్యవహారంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.