రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో గురువారం వ్యాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు తెలిపారు. ఉదయం సుప్రభాత సేవ, విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా, అన్నమాచార్య సంకీర్తనలు జరుగుతాయని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.