చిట్వేలి మండలం వెంకటరాజుపల్లిలో శనివారం పులపుత్తూరు రామలక్ష్మమ్మ మరణించారు. ఈ వార్త తెలిసిన వెంటనే రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి వెంకటరాజుపల్లికి చేరుకుని, రామలక్ష్మమ్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముక్కా వరలక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.