విద్యార్థులకు చదువు చెప్పే ఉపాధ్యాయుని సేవలు మరువలేనివని ఎంఈఓ కృష్ణయ్య తెలిపారు. గురువారం వీరబల్లి మండలంలో సానేపాయి పంచాయతీలో కృష్ణమయ్య పల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన శ్రీనివాసులు రెడ్డికి మండల కేంద్రంలో ఉపాధ్యాయులందరూ కలిసి ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాజంలో గురువుకున్న స్థానం మరి ఎవరికి లేదన్నారు.