పల్స్ పోలియోపై మైక్ ద్వారా విస్తృత ప్రచారం

సుండుపల్లి మండలంలో ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై శనివారం వైద్యశాఖ అధికారులు మైక్ ద్వారా అవగాహన కల్పించారు. పుట్టినప్పటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని వైద్యాధికారి డాక్టర్ దిలీప్ గుప్తా సూచించారు. పోలియో రహిత సమాజం కోసం తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ నటేష్, సీహెచ్‌వో రామకృష్ణయ్య, రామయ్యతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్