అన్నమయ్య జిల్లా పోలీసు విభాగంలో నిరంతరం విధులు నిర్వర్తించి, పదవీ విరమణ పొందిన వాయల్పాడు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ శ్రీనివాసులుకి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఘనంగా ఆత్మీయ వీడ్కోలు మరియు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏఎస్ఐ శ్రీనివాసులు పోలీసు శాఖలో అంకితభావంతో విశేష సేవలు అందించారని, క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించడంతో పాటు, ప్రజలకు అహర్నిశలు సేవలు అందించారని ప్రశంసించారు.