దారుల్ ఉలూమ్ ఇమ్ దాదియా మదరసాలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాయచోటిలోని దారుల్ ఉలూమ్ ఇమ్ దాదియా మదరసాలో విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంగళవారం ప్రిన్సిపాల్ ముఫ్తీ సయ్యద్ మాసూమ్ సాఖిబ్ తెలిపారు. నూరాని ఖైదా, నాజిరాఖురాన్, హిబ్జ్, పార్సీ, దరసె నిజామి, మౌల్వీ కోర్సుల్లో చేరవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉచిత భోజనం, దుస్తులు, వైద్య, హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిలబస్ ప్రకారం హైస్కూల్ వరకు విద్యాబోధన చేసి సర్టిఫికెట్లు అందజేస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 9441432607, 9030272740, 8500962886 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్