జిల్లా కేంద్ర కొనసాగింపుకు కృతజ్ఞత సభ ఏర్పాట్లు వేగవంతం

రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించినందుకు కృతజ్ఞత, అభినందన సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 4న జరగనున్న సభ పనులను టిడిపి నేత మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ప్రజాభిలాష మేరకు రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచిన ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని నాయకులు పేర్కొన్నారు. ప్రజలు, అన్ని వర్గాలు భారీగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్