వి. కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ బుధవారం రాత్రి రాయచోటిలో నిరసన ర్యాలీ జరిగింది. వైఎస్సార్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సర్ఫరాజ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం నుంచి బంగ్లా సర్కిల్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రికలు, రిపోర్టర్లు మూల స్తంభాలని, వారిపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పని తెలిపారు.