అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

అన్నమయ్య జిల్లా రెడ్డిపల్లె చెరువు కట్టపై ఆదివారం రాత్రి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతులను మామిడి కాయలు కోసే కూలీలుగా గుర్తించారు. లారీ మామిడి కాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్