కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్లకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం రాయచోటిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఇప్పుడు ట్వీట్లు, ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఉద్దేశించి, "అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడే ధైర్యం ఉంటే చూపించండి" అని మంత్రి సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మండిపల్లి తెలిపారు.