రాయచోటిలో చేపట్టిన ప్రజల ఆత్మఘోష నిరసన ర్యాలీలో బుధవారం మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గతంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఆయన తన పదవికి రాజీనామా చేస్తే, తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. అలాగే తిరిగి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగిస్తే, తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటానని సవాల్ విసిరారు.