గాలివీడు: గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

గాలివీడు మండలంలోని గోరాంచెరువు గ్రామం బూచేవాండ్లపల్లెలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. ఇంటిపై గాలిపటం ఎగరేస్తున్న ఐదేళ్ల ఆనంద్ శ్రీనివాస్ అనే బాలుడు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్న బాలుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్