అన్నమయ్య జిల్లాలో శనివారం వాతావరణం ఒక్కసారిగా మారి, రాయచోటితో పాటు పరిసర గ్రామాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న రైతులు ఈ వర్షాలు పంటల సాగుకు ఉపయోగపడతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.