మంగళవారం చక్రాపేట మండలం అద్దాలమర్రి క్రాస్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో గ్యాస్ లారీ ప్రమాదానికి గురికావడంతో, అధికారులు వాహనాలను వేంపల్లి మీదుగా మళ్లించారు. అయితే, అద్దాలమర్రి క్రాస్ వద్ద రోడ్డు పనులు జరుగుతుండటంతో వాహనాలు నిలిచిపోయి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వాహనాలను క్రమబద్ధీకరించారు.