రాయచోటి డివిజన్ పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలపై డీవైఎఫ్‌వో రామ్మోహన్ నాయక్ ఆదివారం వివరాలు వెల్లడించారు. డివిజన్‌లో మొత్తం 246.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా గాలివీడులో అత్యధికంగా 136.2 మి.మీ, ఎల్.ఆర్. పల్లెలో 38.0 మి.మీ, రాయచోటిలో 26.8 మి.మీ, రామాపురంలో 16.0 మి.మీ, సంబేపల్లెలో 15.2 మి.మీ, చిన్నమండెంలో 14.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. గాలివీడు మండలంలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు.