అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్.. 24 ఖరీదైన బైక్‌ల స్వాధీనం

రాయచోటిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ ఆరిఫ్ (38)తో పాటు ముగ్గురు రిసీవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడి వద్ద నుండి సుమారు రూ. 40 లక్షల విలువైన 17 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లు, 5 పల్సర్ సహా మొత్తం 24 బైక్‌లను పీలేరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడి, పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో తాళాలు విరగ్గొట్టి ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సమర్థవంతంగా పనిచేసిన పీలేరు సీఐ యుగంధర్, ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.

సంబంధిత పోస్ట్