బట్రాజుగారిపల్లి రోడ్డు దుస్థితి పరిశీలించిన జనసేన నేత

టి. సుండుపల్లి మండలంలోని పెద్దినేని కాలువ పంచాయతీ పరిధిలోని బట్రాజుగారిపల్లికి వెళ్లే గుంతలమయమైన రోడ్డును మంగళవారం జనసేన నాయకుడు రామా శ్రీనివాస్ గ్రామస్థులతో కలిసి పరిశీలించారు. రోడ్డు సరిగా లేకపోవడంతో విద్యార్థులు, రోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు తెలిపారు. తక్షణమే నిధులు మంజూరు చేసి రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేయాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్