పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై జేసీ ఆకస్మిక తనిఖీ

అన్నమయ్య జిల్లా చిన్నమండెంలోని మల్లూరు, వండాడి, లక్కిరెడ్డిపల్లి, పందిళ్లపల్లి గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాలను సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దారులను సమీక్షించి, లబ్ధిదారులకు పాసుపుస్తకాల వివరాలు సమగ్రంగా వివరిస్తున్నారా, ఎన్ని పంపిణీ అయ్యాయో అడిగి సూచనలు ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు తెలుసుకునేలా అవగాహన కల్పించాలని, తప్పులుంటే అర్జీ ద్వారా సరిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్