కొమ్మర గంగాధర్ ఆరోపణలు అవాస్తవం: సీఐ రోషన్

లక్కిరెడ్డిపల్లి ఇంచార్జ్ సీఐ రోషన్, కొమ్మర గంగాధర్ చేస్తున్న ఆరోపణలను సోమవారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబానికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని, ఆరోపణలు చేస్తున్న రాజేంద్ర రెడ్డికి అక్కడ భూమే లేదని తెలిపారు. గంగాధర్‌పై ఇప్పటికే ఐదు కేసులు నమోదై ఉండగా, 2023లోనే రౌడీ షీట్ తెరిచినట్లు వెల్లడించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, బాధితులు నేరుగా పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం చేస్తామని సీఐ భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్