పొలం పనులకు వెళ్లిన సమయంలో దొంగలు తలుపులకు వేసిన తాళం పగులగొట్టి నగలు, నగదు అపహరించుకు వెళ్లారు. బాధితుల కథనం మేరకు మోటారుకు మరమ్మతులు చేస్తుండడంతో లక్కీరెడ్డి పల్లి మండలంలోని కోనంపేటకు చెందిన రామచంద్రయ్య కుటుంబ సభ్యులందరూ బుధవారం తలుపులకు తాళం వేసి పొలం వద్దకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు గడ్డపారతో తాళం పగలగొట్టి బీరువాలో దాచిన రూ. లక్ష, బంగారు నగలు అపహరించికుపోయినట్లు బాధితుడు తెలిపారు.