లక్కిరెడ్డిపల్లె యువకుడు రైలు కిందపడి మృతి

రాయచోటి నియోజకవర్గంలో బుధవారం ఉదయం షేక్ హుస్సేన్ (30) అనే యువకుడు కడప సమీపంలోని రైల్వేట్రాక్‌పై శవమై కనిపించాడు. మృతుడి తల, మొండెం వేరువేరుగా పడి ఉండటాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్