లక్కిరెడ్డిపల్లి మండలంలోని మద్దిరేవుల గ్రామం మాజీ సర్పంచ్, మాజీ డిసిసిబి డైరెక్టర్ మద్దిరేవుల రాజారెడ్డి అనారోగ్యంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రాజారెడ్డి నిత్యం ప్రజల్లో మమేకం అయ్యి ప్రజా సేవకే అంకితం అయ్యి గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారన్నారు. అందరిని ఆప్యాయంగా పలకరించే రాజారెడ్డి మృతి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.