లక్కిరెడ్డిపల్లి మండలంలోని గుద్దగుంట్లరాచ పల్లెకు చెందిన సుజాతమ్మ ను జెర్సీ ఆవు పొడవడంతో శనివారం మృతి చెందింది. బంధువుల వివరాలమేరకు. పంట పొలాల్లో తమకున్న ఆవులను మేపుకోవడానికి వెళ్లిన సుజాతమ్మ పైకి ఉన్నట్టుండి ఆవు దూసుకొచ్చి పైకి లేపి కిందపడేసింది. ఈ సంఘటనను గమనించిన మరో మహిళ బంధువులకు సమాచారం అందించింది. వెంటనే వారు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యం లోనే మృతి చెందింది.