మల్లూరమ్మ జాతరకు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆహ్వానం

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం కొత్తపల్లిలో బుధవారం నుండి ప్రారంభంకానున్న మల్లూరమ్మ తల్లి జాతర మహోత్సవానికి హాజరుకావాలని ఆలయ ధర్మకర్తలు, టీడీపీ నాయకులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి మంగళవారం ఉదయం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని, ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర విజయవంతం కావాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్