అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు: ఖాదర్ బాషా

రాజధాని అమరావతి అభివృద్ధిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు గాజుల ఖాదర్ బాషా ఆరోపించారు. రాయచోటిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2027 నాటికి అమరావతి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. అమరావతి రైతులను పరామర్శించేందుకే కాకుండా ఉద్రిక్తతలు సృష్టించేందుకే వైసీపీ నేతలు వెళ్లారని విమర్శించారు. రైతుల త్యాగాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్