రాయచోటిలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, 7వ, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ప్రిన్సిపాల్ నీలి రేఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 24న ప్రవేశ పరీక్ష, 25న ఫలితాల ప్రకటన, 26న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. మరిన్ని వివరాలకు పాఠశాలను సంప్రదించవచ్చు.