భద్రకాళీ అమ్మవారికి ఘనంగా రాహుకాల పూజలు

రాయచోటిలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో శుక్రవారం భద్రకాళీ అమ్మవారికి రాహుకాల పూజలు ఘనంగా జరిగాయి. ఈ పూజల్లో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉప ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణయ్య స్వామి రాహుకాల పూజల విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను మహిళా భక్తులకు వివరించారు. అనంతరం ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, కార్యనిర్వాహణాధికారి డి. వి. రమణారెడ్డి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్