రాయచోటి డివిజన్‌లో వర్షపాతం నమోదు వివరాలు

రాయచోటి డివిజన్ పరిధిలో సోమవారం గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను డీవైఎస్‌వో రామ్మోహన్ నాయక్ వెల్లడించారు. గాలివీడులో 5.4 మి.మీ, చిన్నమండెంలో 7.2 మి.మీ, సంబేపల్లిలో 9.0 మి.మీ, రాయచోటిలో అత్యధికంగా 12.8 మి.మీ వర్షం కురిసింది. లక్కిరెడ్డిపల్లిలో 6.2 మి.మీ, రామాపురంలో 4.6 మి.మీ, గుర్రంకొండలో 6.0 మి.మీ, కలకడలో 10.2 మి.మీ, కంభంవారి పల్లిలో 9.4 మి.మీ వర్షపాతం నమోదైంది. పీలేరు మండలంలో 4.4 మి.మీ వర్షం కురవగా, మిగతా మండలాల్లో వర్షం పడలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్