ఈ నెల 3న సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు జిల్లాకు రానున్నారని, ఆయన పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామాంజులు పిలుపునిచ్చారు. గురువారం ఆయన స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో నిర్వహించనునన్న సీఐటీయూ జాతీయ మహాసభల్లో చర్చించాల్సిన అంశాలను వివరిస్తారన్నారు.