రాయచోటి మున్సిపాలిటీ చలపతి వీధికి చెందిన శంకరపు రెడ్డి శేఖర్ అనారోగ్య సమస్యతో బాధపడుతూ చెన్నై నందు చికిత్స పొంది మరణించాడు. ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన రూ. 5 లక్షల చెక్కును తల్లి శంకరపు రామసుబ్బమ్మకి శనివారం అందించడం జరిగింది. చెక్కు అందుకున్న కుటుంబ సభ్యులు మంత్రికి మరియు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.