చెత్త సేకరణ సామర్థ్యాన్ని పెంచేందుకు కేవలం రూ. లక్ష ఖర్చుతో తయారు చేయించిన ట్రై సైకిల్ ను జిల్లా కలెక్టర్ శ్రీధర్ అందించారు. గురువారం రాయచోటి మండలం పెమ్మాడపల్లి గ్రామపంచాయతీ సెక్రటరీ సహజీయా సుల్తానా కు కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో చేయించిన త్రిచక్ర వాహనాన్ని వినియోగించుకుని గ్రామపంచాయతీ పరిధిలోని 100% ఇళ్ల ద్వారా చెత్తను సేకరించాలని ఆదేశించారు.