రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో పేరెంట్స్-టీచర్స్ 2. 0 సమావేశాలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలల్లో జరిగిన పేరెంట్స్-టీచర్స్ 2.0 సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పేరెంట్స్-టీచర్స్ సమావేశానికి జిల్లాలోని పోలీసు అధికారులు హాజరై, విద్యార్థుల ఉద్దేశించి విలువైన సందేశాన్ని అందించారు.