రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో గురువారం అమ్మవారిని శాఖాంబరి దేవిగా అలంకరించారు. పండ్లు, కూరగాయలు, కూరలతో విశేషంగా అభిషేకించి శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయ పరిపాలనాధికారి రమణారెడ్డి దర్శన ఏర్పాట్లు చేయగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.