రాయచోటి పట్టణంలో డైట్‌లో బేసిక్ గైడ్ కెప్టెన్ల శిక్షణను మంగళవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సుబ్రమణ్యం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గైడ్ కెప్టెన్లు స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం శిక్షణ ఇవ్వడం ద్వారా దేశభక్తి, సేవాభావం, నైతిక విలువలు పెంపొందించవచ్చని ఆయన తెలిపారు.