రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి ప్రసంగంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన హైదరాబాద్ కు చెందిన అన్వేష్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేయగా నిందితుడిని సోమవారం రాయచోటి కోర్టులో హాజరు పర్చినట్టు పోలీసులు తెలిపారు. ఎవరైన అసభ్యకర వ్యాఖ్యలు చేసిన, పోస్టులు పెట్టిన చట్టరీత్యా నేరమని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.