రాయచోటి మండలం ఇనాయత్ చెరువు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటకొండ రవి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గరుగుపల్లిలోని తన ఇంటికి వెళ్తుండగా, గునుకుంట్ల నుంచి వస్తున్న ట్రాక్టర్ ఆయన్ని ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.