రాయచోటి కౌన్సిలర్లకు ఘన సన్మానం

రాయచోటి మున్సిపల్ పాలకవర్గ పదవీకాలం ముగిసిన సందర్భంగా, వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం కౌన్సిలర్లకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌన్సిలర్ల సేవలు అభినందనీయమని, ప్రజలతో అనుబంధం కొనసాగించాలని సూచించారు. గత ఐదేళ్లలో రాయచోటి అభివృద్ధి చారిత్రాత్మకమని, రహదారులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, గృహ నిర్మాణాలు వంటి పలు పనులు పాలకవర్గ సహకారంతో జరిగాయని, కరోనా సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్