రాయచోటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న తాగునీరు, ఇంజనీరింగ్ విభాగాల కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది. సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన దీక్షలో పాల్గొన్నారు. సిఐటియు రామాంజులు మాట్లాడుతూ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.