ప్రజలందరూ సంతృప్తి చెందేలా అధికారులు, సిబ్బంది సేవలందించాలని మార్గదర్శలను, బంగారు కుటుంబాలను మ్యాప్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలోని సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేదరికం లేని సమాజం పి-4 కార్యక్రమం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.