రాయచోటి: ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన ప్రాజెక్టు డైరెక్టర్

రాయచోటి మండలం వరిగపాపిరెడ్డి గారి పల్లి గ్రామపంచాయతీ ఉపాధి హామీ పనులను శుక్రవారం ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు 100 రోజులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. భూగర్భ జలాలు పెరిగే విధంగా రైతు పొలాలలో పంట కుంటలు తవ్వుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్