విశాఖపట్నం విద్యార్థులు, యువజన సంఘాల నాయకులపై పెట్టిన రౌడీషీట్‌ను తీసివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, శుక్రవారం రాయచోటిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, ఏఐవైఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్, పలువురు విద్యార్థులు పాల్గొని, రౌడీషీట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం, స్థానిక అధికారులను కోరారు.