అన్నమయ్య జిల్లాలో ఉద్యాన పంటలు సాగు చేసుకునేందుకు రైతులకు రాయితీ కల్పిస్తున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుభాషిణి ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. పంటల కోత అనంతరం వాటిని గ్రేడింగ్, ప్యాకింగ్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఆమె తెలిపారు. దీంతో పాటు పండ్లు, పూలు, కూరగాయల పంటలకు బీమా కూడా కల్పిస్తుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం (9703814184) సంప్రదించాల్సిందిగా ఆమె తెలిపారు.