చిన్ననాటి నుంచి విద్యార్థులు ఇతరులతో పోటీపడి చదివినప్పుడే వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని డైట్ ప్రిన్సిపాల్ ఎంఆర్ఎస్ అజయ్ కుమార్ బాబు అన్నారు. బుధవారం రాయచోటి పట్టణంలోని డైట్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెయింటింగ్, లింగ సమానత్వంపై వ్యాసరచనలో విద్యార్థులకు ఉమ్మడి కడప జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అలవాటుతో భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు.