ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యతను గురువులే తీసుకోవాలని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణ పరిధిలోని అర్చన విద్యాసంస్థల్లో జరుగుతున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల 4 రోజుల శిక్షణ కార్యక్రమం ముఖ్యఅతిథిగా మంత్రి మండిపల్లి హాజరై ఆయన మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు ఉత్తమ బోధకుడిగా మారి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు విద్యా ప్రమాణాలు పెంచడానికి తమ వంతు కృషి చేయాలన్నారు.