మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ఉదయం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు ని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నేడు 218285 పింఛన్లను అందిస్తున్నామన్నారు. జిల్లా లో ఈ నెల నుండి 3987 నూతన వితంతు పింఛన్లు మంజూరు చేశామన్నారు.