కష్టాలలో ఉన్న రైతులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్ళితే ఏకంగా రైతులపై ఎస్పీ స్థాయి జిల్లా అధికారులు లాఠీ చార్జి చేయడం దుర్మార్గని, పర్యటనకు ఇన్ని ఆంక్షలు ఎందుకు అని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి బుధవారం అన్నారు. గతంలో మిర్చి రైతుల సమస్యలపైన, పొగాకు రైతుల గురించి ప్రతిపక్ష నేత గా జగన్ వెళ్లి మాట్లాడితేనే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిందన్నారు.