ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం రాయచోటిలో పింఛన్ల పంపిణీ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మహిళలకే ఓట్లు కావాలే కానీ వారికి గౌరవం ఇవ్వడం తెలియదని ధ్వజమెత్తారు. ఈనెల 15 నుంచి ఉచిత బస్సు సేవలు ప్రారంభమవుతాయని, ఇప్పటికే 1400 కొత్త బస్సులు కొనుగోలు చేశామన్నారు.