రాయచోటి: యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి – మంత్రి

రాయచోటి పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం జరిగిన ఆర్‌పీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించిన ఆయన, విజేత జట్లకు ట్రోఫీలు, ప్రైజ్ మనీలు అందజేశారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం అందిస్తుందని, రాయచోటిలో అత్యాధునిక క్రీడామైదానం త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల రోజులపాటు పోటీలు ప్రశాంతంగా నిర్వహించిన నిర్వాహకులను మంత్రి అభినందించారు.

సంబంధిత పోస్ట్