నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు స్కౌట్ శిక్షణ – డిఈఓ

రాయచోటి పట్టణంలో అక్టోబర్ 25 నుంచి 31 వరకు జరిగిన స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టన్ల 7 రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విద్యార్థులు చిన్ననాటి నుండే క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక సేవా భావాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచ స్థాయి పౌరులుగా ఎదగగలరని తెలిపారు. ఈ శిక్షణలో 160 మంది స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టన్లు పాల్గొని, ప్రాథమిక చికిత్స, రోడ్డు ప్రమాదాల శిక్షణ పొందారు.

సంబంధిత పోస్ట్